బైబిల్ · Indian Revised Version (Telugu) 2019

కీర్తనలు 150

1 యెహోవాను కీర్తించండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో దేవుణ్ణి స్తుతించండి. ఆయన ప్రభావాన్ని గొప్పచేసే ఆకాశవిశాలాల్లో ఆయనను స్తుతించండి.

2 ఆయన బలమైన కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి. ఆయనకున్న గొప్ప బలప్రభావాలను బట్టి ఆయనను స్తుతించండి.

3 బాకాలు ఊదుతూ ఆయనను స్తుతించండి. సితారాతో, శ్రావ్యమైన స్వరాలతో ఆయనను స్తుతించండి.

4 తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆయనను స్తుతించండి. తంతివాద్యం మీటుతూ, వేణువు మోగిస్తూ ఆయనను స్తుతించండి.

5 తాళాలు మోగిస్తూ ఆయనను స్తుతించండి. గంభీరమైన ధ్వనులు చేసే తాళాలు వాయిస్తూ ఆయనను స్తుతించండి.

6 ప్రాణం ఉన్న ప్రతి జీవీ యెహోవాను స్తుతిస్తుంది గాక. యెహోవాను కీర్తించండి.

Indian Revised Version (Telugu) 2019 — © 2017, 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0