బైబిల్ · Indian Revised Version (Telugu) 2019

కీర్తనలు 131

1 యెహోవా, నా హృదయంలో అహంకారం లేదు. నా కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించడం లేదు. నాకు మించిన విషయాల జోలికి నేను వెళ్ళడం లేదు.

2 తల్లిపాలు విడిచిన పిల్ల తన తల్లి దగ్గర నిశ్చింతగా ఉన్నట్టు నేను ప్రశాంతంగా ఉండి నాప్రాణాన్ని స్థిమితంగా ఉంచుకున్నాను.

3 ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పటి నుండి ఎప్పటికీ యెహోవా పైనే ఆశ పెట్టుకోండి.

Indian Revised Version (Telugu) 2019 — © 2017, 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0